
‘డీఎన్‌ఏ’ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
‘మీ డీఎన్‌ఏలో ఏదో సమస్య ఉంద’ని ప్రధాని మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ డిమాండ్ చేశారు...
పట్నా: ‘మీ డీఎన్‌ఏలో ఏదో సమస్య ఉంద’ని ప్రధాని మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ డిమాండ్ చేశారు. లేకపోతే ‘శబ్ద వాపసీ’ పేరిట ఉద్యమం ప్రారంభిస్తామని, 50 లక్షల మంది డీఎన్‌ఏ శాంపిళ్లను పరీక్షల కోసం ప్రధాని మోదీకి పంపుతామని ప్రకటించారు. ఈ అంశంలో మోదీపై ఒత్తిడి పెంచేందుకు నాలుగైదు స్వాభిమాన్ ర్యాలీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందులో మొదటి ర్యాలీని ఈ నెల 29న పట్నాలో నిర్వహిస్తామన్నారు. మోదీ చేసిన డీఎన్‌ఏ వ్యాఖ్యలు బిహార్ ప్రజలను అవమానించడమే అని ఆయన మండిపడ్డారు. బిహార్‌లో జేడీయూ-ఆర్‌జేడీలది అవకాశవాద కూటమి అని ఆదివారం ప్రధాని మోదీ విమర్శలు చేసిన నేపథ్యంలో నితీశ్ ట్విటర్‌లో మోదీని విమర్శించారు.