దీపావళి ధమాకా: 10వేల ఉద్యోగాలు | Diwali surge at Snapdeal to create nearly 10000 temporary jobs | Sakshi
Sakshi News home page

దీపావళి ధమాకా: 10వేల ఉద్యోగాలు

Sep 10 2016 9:25 AM | Updated on Sep 4 2017 12:58 PM

దీపావళి ధమాకా: 10వేల ఉద్యోగాలు

దీపావళి ధమాకా: 10వేల ఉద్యోగాలు

చేతిలో సరిపడా ఉద్యోగులు లేక, పండుగ సీజన్ల్లో వస్తువుల డెలివరీని జాప్యం చేయకూడదని దేశీయ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ నిర్ణయించింది.

చేతిలో సరిపడా ఉద్యోగులు లేక, పండుగ సీజన్ల్లో వస్తువుల డెలివరీని జాప్యం చేయకూడదని దేశీయ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో తాత్కాలికంగా అదనపు ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఉన్నట్టుండి దాదాపు 10,000 తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించనున్నట్టు స్నాప్డీల్ పేర్కొంది. ముఖ్యంగా డెలివరీలో ఎలాంటి సమస్యలు రాకుండా, వెనువెంటనే జరిపేటట్టు లాజిస్టిక్ పొజిషన్లలో వీరిని నియమించుకోనుంది. దీపావళి కానుకగా ఈ తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించనున్నట్టు స్నాప్డీల్ పేర్కొంటోంది.
 
దీపావళి పండుగ సీజన్ అంతా, అన్ని లాజిస్టిక్ సెంటర్లు  24X7 పనిచేయనున్నట్టు తెలిపింది. ఆర్డర్లు రిసీవ్ చేసుకుని, స్క్రీన్ చేసి, వాటిని డెలివరీ చేసేందుకు ఈ తాత్కాలిక ఉద్యోగులు పనిచేయనున్నారు. ఎస్డీ ప్లస్ సెంటర్లు ఆర్డర్లను ప్రాసెస్ను నిరంతరాయం కొనసాగిస్తాయని, అర్థరాత్రి స్వీకరించిన ఆర్డర్లను, తర్వాతి రోజు ఉదయం పూట అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో ఈ దీపావళి సీజన్లో కస్టమర్లు ఆర్డరు చేసిన వస్తువులను ఒకటి రెండు రోజుల్లోనే డెలివరీ చేసే విధంగా అప్గ్రేట్ కావాలని నిర్ణయించుకున్నట్టు స్నాప్డీల్ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ జయంత్ సూద్ తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement