సీమాంధ్ర ఎంపీలను బుజ్జగిస్తున్నకాంగ్రెస్ అధిష్టానం | digvijay singh meets seemandhra mp's | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఎంపీలను బుజ్జగిస్తున్నకాంగ్రెస్ అధిష్టానం

Dec 9 2013 11:23 PM | Updated on Mar 18 2019 7:55 PM

ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని నిర్ణయించిన సీమాంధ్ర ఎంపీలను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది.

ఢిల్లీ: ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని నిర్ణయించిన సీమాంధ్ర ఎంపీలను కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాసం తీర్మానం పెట్టాలని తీర్మానించారు. ఈ క్రమంలో ముందుగానే మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్ర ఎంపీలతో మంతనాలు జరుపుతున్నారు. సోమవారం రాత్రి రాష్ట్ర వ్యవహారాల రాజకీయ సలహాదారు దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర ఎంపీలతో సమావేశమైయ్యారు. అవిశ్వాసతీర్మాన నోటీసు ఉపసంహరించుకోవాలని దిగ్విజయ్ వారికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, అహ్మద్ పటేల్ కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లో సీమాంధ్ర ఎంపీలతో మాట్లాడి అవిశ్వాసం తీర్మానం పెట్టకుండా ఉండాలని విన్నవిస్తున్నారు.

 

అవిశ్వాస తీర్మానానికి 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతించాల్సివుంటుందని సీమాంధ్ర ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. అవిశ్వాసం పెట్టాలంటే పార్లమెంట్ సభ్యత్వం ఉండాలని, అందుకే ఇంతకుముందు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నట్టు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement