మెనింజైటిస్ విలయతాండవం.. 489 మంది బలి | Death toll in Nigeria meningitis outbreaks | Sakshi
Sakshi News home page

మెనింజైటిస్ విలయతాండవం.. 489 మంది బలి

Apr 12 2017 5:07 PM | Updated on Sep 5 2017 8:36 AM

ఈ మహమ్మారి బారినపడి గడిచిన వారం వ్యవధిలోనే 489 మంది మరణించారు. దీనికి విరుగుడుగా పనిచేసే వ్యాక్సిన్ కొరత ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం..

- మరో 5 వేల మందికీ ప్రాణాంతక వైరస్‌
- నైజీరియాలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి



వారి:
తలనొప్పితో కూడిన జర్వంగా మొదలై, వాంతులు, కండరాలు పట్టేయడం, గంటలు గడిచేలోగా చర్మం తెల్లగా పాలిపోయి శరీరంపై దద్దుర్లు రావడం, ఊపిరాడని పరిస్థితిలో మెడ, వెన్నెముక పట్టేసినట్లనిపించడం, చివరికి ప్రాణాలు కోల్పోవడం.. ఇదీ ప్రమాదకర మెనింజైటిస్‌(మెదడువాపు) వ్యాధి లక్షణాలు. నైజీరియాలో ఈ మహమ్మారి బారినపడి గడిచిన వారం వ్యవధిలోనే 489 మంది మరణించారు. నైజీరియా ఆరోగ్య శాఖ మంత్రి ఇస్సాక్‌ బుధవారం మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు.

దేశంలో మరో 5వేల మందికి మెనింజైటిస్‌ సోకినట్లు గుర్తించామని, దీనికి విరుగుడుగా పనిచేసే బెక్స్‌సెరో వ్యాక్సిన్ ను పపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా బెక్స్‌సెరో వ్యాక్సిన​ కొరత ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయినవారిలో అత్యధికులు జంపారా ప్రాంతానికి చెందినవారేనని, కత్సిన, కెబ్బీ, నైగర్‌, సొకొటో రాష్ట్రాల్లోనూ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నట్లు వివరించారు.

పేద దేశమైన నైజీరియాలో తరచూ ప్రమాదకర వ్యాధులు ప్రబటడం, పెద్ద సంఖ్యలో జనం మృత్యువాతపడటం తెలిసిందే. 2015లో ఇదే మెనింజైటిస్‌ వ్యాధి విజృంభించడంతో 1200 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement