'రిషితేశ్వరి' నిందితుల బెయిల్ విచారణ వాయిదా | Sakshi
Sakshi News home page

'రిషితేశ్వరి' నిందితుల బెయిల్ విచారణ వాయిదా

Published Fri, Aug 7 2015 1:46 PM

Culprits bail petition hearing adjourned to august 10th due to Rishiteswari suicide

గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రుషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ విచారణ ఆగస్టు 10 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జిల్లా కోర్టు జడ్జి శుక్రవారం ప్రకటించారు. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. అంతకుముందు మృతురాలు తండ్రి ఎం. మురళీకృష్ణ తనను కూడా రికార్డు పరంగా ప్రతివాది తరపున సీనియర్ న్యాయవాది వైకే బుధవారం పిటిషన్ దాఖలు చేయగా అది గురువారం విచారణకు వచ్చింది.


అయితే బాధితులు తమకు నచ్చిన న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉందని అందుకు అనుమతించాలనే న్యాయసూత్రాన్ని న్యాయవాది వైకే తన వాదన ద్వారా జడ్జికి విన్నవించారు. వైకే వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి గోపీచంద్ బెయిల్ పిటీషన్‌లో రెండవ ప్రతివాదిగా మురళీకృష్ణను చేర్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  దీంతో పాటు కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement