
పిట్టల్ని కొట్టబోతే మంటలంటుకున్నాయి
చెన్నై విమానాశ్రయంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు భయాందోళన కలిగించాయి.
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు భయాందోళన కలిగించాయి. రన్ వేకు సమీపంలోని బే 55 వద్ద మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక దళం వెంటనే మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు.
పక్షులను చెదరగొట్టేందుకు పేల్చిన బాణాసంచా ఎండు గడ్డి మీద పడి మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. గత వారం బే 48 వద్ద ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. విమానాలు పైకి ఎగరడానికి, దిగడానికి ముందు పక్షులను చెదరగొట్టేందుకు బాణాసంచా కాల్చడం చేస్తుంటారు.