వేగంగా కోలుకుంటున్న సోనియా | Congress President Sonia Gandhi recovering well | Sakshi
Sakshi News home page

వేగంగా కోలుకుంటున్న సోనియా

Aug 7 2016 1:18 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వేగంగా కోలుకుంటున్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వేగంగా కోలుకుంటున్నారు. శనివారం ఆమె వాకింగ్, వ్యాయామం చేసినట్టు ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఆస్పత్రి వైద్యులు ఈ రోజు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఉన్నతస్థాయి వైద్యబృందం సోనియా ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  

వారణాశి ర్యాలీ సందర్భంగా అస్వస్థతకు గురైన సోనియా గంగారామ్ ఆస్పత్రిలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స చేయించి, ఈ నెల 3న గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్తో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియాను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement