కాశ్మీర్లో వేర్పాటువాదుల తెగింపు | Clashes mar first-ever intl marathon in Valley | Sakshi
Sakshi News home page

కాశ్మీర్లో వేర్పాటువాదుల తెగింపు

Sep 13 2015 1:46 PM | Updated on Sep 3 2017 9:20 AM

జమ్మూకాశ్మీర్లోని వేర్పాటువాదులు భారత్కు వ్యతిరేకంగా మరో అంకానికి తెరతీశారు. ఇప్పటి వరకు నిరసనల, ఆందోళనలు,హార్తాళ్లు, పాక్ జెండా ప్రదర్శనల ద్వారా పాకిస్థాన్ అనుకూల చర్యలకు దిగి.. తాజాగా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్కు అనుకూల ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని వేర్పాటువాదులు భారత్కు వ్యతిరేకంగా మరో అంకానికి తెరతీశారు. ఇప్పటి వరకు నిరసనల, ఆందోళనలు,హార్తాళ్లు, పాక్ జెండా ప్రదర్శనల ద్వారా పాకిస్థాన్ అనుకూల చర్యలకు దిగి.. తాజాగా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్కు అనుకూల ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏకంగా 21 కిలోమీటర్లపాటు మారథాన్ ప్రారంభించారు. హజ్రత్బల్ ప్రాంతంలోని కాశ్మీర్ యూనివర్సిటీ నుంచి ఈ ర్యాలీ ప్రారంభంకాగా మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు.

ఈ ర్యాలీ సమాచారం ముందుగానే తెలుసుకున్న పోలీసులు భారీగా ఆ ప్రాంతంలో మోహరించగా వేర్పాటువాదులువారిపై రాళ్లు రువ్వారు. భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా బయలుదేరడం గమనార్హం. అయితే, పోలీసులు జోక్యం చేసుకున్నారని ఘర్షణ వాతావరణం నెలకొందని తెలిసి ఆయన ఆగిపోయారు. ఇక రాష్ట్రానికి చెందిన 15 మంది అథ్లెట్స్ కూడా పాల్గొనేందుకు తమ పేరును నమోదు చేసుకోవడం గమనార్హం. మొత్తం పదిహేను వేలమంది ఈ ర్యాలీలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement