నలుగురు రాధల కృష్ణుడి అరెస్టు | Chinese man arrested for juggling multiple wives | Sakshi
Sakshi News home page

నలుగురు రాధల కృష్ణుడి అరెస్టు

Jul 22 2014 2:51 PM | Updated on Aug 13 2018 3:35 PM

నలుగురు రాధల కృష్ణుడి అరెస్టు - Sakshi

నలుగురు రాధల కృష్ణుడి అరెస్టు

ఒకరికి తెలియకుండా మరొకరితో.. వాళ్లకు తెలియకుండా వేరొకరితో.. వాళ్లకీ తెలియనివ్వకుండా ఇంకొకరితో వ్యవహారం నడిపిస్తున్న చైనా కృష్ణుడిని అక్కడి గువాంగ్ డాంగ్ పోలీసులు అరెస్టు చేశారు.

ఒకరికి తెలియకుండా మరొకరితో.. వాళ్లకు తెలియకుండా వేరొకరితో.. వాళ్లకీ తెలియనివ్వకుండా ఇంకొకరితో వ్యవహారం నడిపిస్తున్న చైనా కృష్ణుడిని అక్కడి గువాంగ్ డాంగ్ పోలీసులు అరెస్టు చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు. నలుగురు భార్యలతో 20 ఏళ్ల పాటు ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం నడిపించిన చెన్ (45) ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.

తన భర్తకు మరొకరితో సంబంధం ఉందని అనుమానం వచ్చిన ఒక భార్య అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ అంతవరకు తన భర్త ఇంత గ్రంధసాంగుడన్న విషయం తెలియదు. అతడి పెళ్లి సర్టిఫికెట్లు చైనా నేషనల్ ఆన్లైన్ డేటాబేస్లో నమోదు కాకపోవడంతో అన్ని పెళ్లిళ్లు చేసుకోగలిగాడు. 1992లో చెన్ మొదటి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 1994, 2007 సంవత్సరాల్లో మరో మూడు పెళ్లిళ్లు చకచకా చేసేసుకున్నాడు. 2013లో విషయం బయటకు వచ్చింది. పిల్లల కోసం భర్తను క్షమించేయాలని తొలుత భావించింది. అయితే, మరో ఇద్దరు ఉన్నారని తెలిసి విడాకులకే వెళ్లింది. బహుభార్యత్వానికి చైనాలో రెండేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement