breaking news
multiple wives
-
కోర్కెలు తీర్చలేదని, లేటు వయసులో ఏడో పెళ్లి
సూరత్: సకల రోగాలతో సతమవుతూనే 63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ ధనిక రైతు. తన కంటే వయసులో ఇరవై ఏళ్లు చిన్నదైన ఆరో భార్య అతనితో శారీరక సంబంధానికి నిరాకరిస్తుందన్న కారణంగా అతను మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ వితంతువును ఆరో వివాహం చేసుకున్న అతను..కరోనా కారణంగా ఆమె దూరం పెట్టడంతో డిసెంబర్ నెలలో ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. తనకు గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నాయని, తన బాగోగులు చూసుకునేందుకు ఓ తోడు కావాలని, అందుకే తను మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన్నది అతని వాదన. ఈ విషయంపై ఆరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతని లీలలు వెలుగు చూశాయి. ఈ నిత్య పెళ్లి కొడుకు ఎవరితోనూ ఎక్కువ కాలం సంసారం చేయడని, డబ్బు ఎరగా చూపి వివాహం చేసుకొని, వాడుకొని వదిలేస్తాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు తన గత వివాహాల గురించి తన వద్ద దాచి పెట్టి వివాహం చేసుకున్నాడని, పెళ్లి సందర్భంగా తనకు ఇస్తానన్న నగదు, ఇళ్లు కూడా ఇవ్వలేదని బాధిత మహిళ ఆరోపించింది. కాగా, అతని మొదటి భార్య.. 20 నుంచి 35 ఏళ్ల మధ్యవయస్కులైన తన సంతానంతో కలిసి అదే గ్రామంలో ఉంటుందన్న విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిపై 498-A సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమ అచార వ్యవహారాల్లో ఇలా వివాహాలు చేసుకోవడం రివాజేనని నిందితుడు వాదించడం కొసమెరుపు. -
నలుగురు రాధల కృష్ణుడి అరెస్టు
ఒకరికి తెలియకుండా మరొకరితో.. వాళ్లకు తెలియకుండా వేరొకరితో.. వాళ్లకీ తెలియనివ్వకుండా ఇంకొకరితో వ్యవహారం నడిపిస్తున్న చైనా కృష్ణుడిని అక్కడి గువాంగ్ డాంగ్ పోలీసులు అరెస్టు చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు. నలుగురు భార్యలతో 20 ఏళ్ల పాటు ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం నడిపించిన చెన్ (45) ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. తన భర్తకు మరొకరితో సంబంధం ఉందని అనుమానం వచ్చిన ఒక భార్య అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ అంతవరకు తన భర్త ఇంత గ్రంధసాంగుడన్న విషయం తెలియదు. అతడి పెళ్లి సర్టిఫికెట్లు చైనా నేషనల్ ఆన్లైన్ డేటాబేస్‌లో నమోదు కాకపోవడంతో అన్ని పెళ్లిళ్లు చేసుకోగలిగాడు. 1992లో చెన్ మొదటి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 1994, 2007 సంవత్సరాల్లో మరో మూడు పెళ్లిళ్లు చకచకా చేసేసుకున్నాడు. 2013లో విషయం బయటకు వచ్చింది. పిల్లల కోసం భర్తను క్షమించేయాలని తొలుత భావించింది. అయితే, మరో ఇద్దరు ఉన్నారని తెలిసి విడాకులకే వెళ్లింది. బహుభార్యత్వానికి చైనాలో రెండేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.