చైనా వడ్డీ రేటు పావుశాతం కోత | China cuts interest rates to 5.1% as economy slows | Sakshi
Sakshi News home page

చైనా వడ్డీ రేటు పావుశాతం కోత

May 11 2015 1:20 AM | Updated on Sep 3 2017 1:48 AM

మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు చైనా కేంద్ర బ్యాంక్ ఆదివారం వడ్డీ రేటును పావుశాతం తగ్గించింది.

బీజీంగ్: మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు చైనా కేంద్ర బ్యాంక్ ఆదివారం వడ్డీ రేటును పావుశాతం తగ్గించింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వడ్డీ రేట్లను తగ్గించడం గత ఆరునెలల్లో ఇది మూడవసారి. కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకిచ్చే రుణాలపై రేటును తాజాగా 5.1 శాతానికి, కేంద్ర బ్యాంకు వద్దవుంచే డిపాజిట్‌పై రేటును 2.25 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పడిపోయింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత చైనా జీడీపీ ఇంత కనిష్టస్థాయికి తగ్గడం ఇదే ప్రధమం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement