నేనేమీ బెదిరిపోను..నేను చాలా గట్టివాడ్ని | Chalapathi comments on facebook live | Sakshi
Sakshi News home page

నేనేమీ బెదిరిపోను..నేను చాలా గట్టివాడ్ని

May 23 2017 12:15 PM | Updated on Aug 28 2018 4:32 PM

నేనేమీ బెదిరిపోను..నేను చాలా గట్టివాడ్ని - Sakshi

నేనేమీ బెదిరిపోను..నేను చాలా గట్టివాడ్ని

తన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారంపై చలపడి సోషల్‌ మీడియాలో స్పందించారు.

హైదరాబాద్‌:  తన వ్యాఖ్యలపై  చెలరేగిన దుమారంపై చలపతి సోషల్‌ మీడియాలో స్పందించారు.  నారీలోకానికి నమస్కారం మంటూ తన ఫేస్‌బుక్‌ లైవ్‌ను మొదలుపెట్టారు. తన వ్యాఖ్యలకు డబుల్‌ మీనింగ్‌ తీసుకున్నారంటూ  దాటవేత వైఖరిని తీసుకున్నారు. అంతేకాదు తనకు మహిళలపట్ల గౌరవం ఉందనీ,  మహిళల పట్ల అవమానకరంగా వున్న యాంకర్‌ ప్రశ్నకు  చాలా నిజాయితీగా, కోపంగా మాట్లాడాను తప్ప వేరే ఏమీ కాదంటూ  చెప్పుకొచ్చారు. ఆడవాళ్లు హానికరం అనే ఆ మాట అడగవచ్చా అని ఆయన ప్రశ్నిచారు. అలా అంటే ఒక్క మగాడు కానీ, మహిళ కానీ ఖండించలేదన్నారు.   అందుకే తాను అలా స్పందించానన్నారు. అంతేకాదు మీరు హర్ట్‌ అయి ఉంటే..  సారీ అంటూనే నేనేమీ బెదిరిపోను.. నేను చాలా గట్టివాడినంటూ వ్యాఖ్యానించడం విశేషం.

నా విజయం వెనుక నా భార్య ఉంది. 40ఏళ్ల క్రితం నా భార్య చనిపోయింది.. అయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా.. వేరే మహిళవైపు చూడకుండా సంసారాన్ని దిద్దుకొచ్చాను.   ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది.  జై మహిళా లోకం  అంటూ డ్యామేజ్‌ కంట్రోల్‌ పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement