 
															46 మందితో కేంద్ర మంత్రి మండలి
భారత నూతన ప్రధానిగా నరేంద్ర మోడీతోపాటు 45 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
	న్యూఢిల్లీ: భారత నూతన ప్రధానిగా నరేంద్ర మోడీతోపాటు 45 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.  అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య రాష్ట్రపతి భవన్‌లో  రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ ఈ సాయంత్రం వారిచేత  ప్రమాణం చేయించారు.  కేంద్ర మంత్రి మండలిలో ఏడుగురు మహిళలకు అవకాశం దక్కింది.  మన రాష్ట్రానికి చెందిన ముగ్గురికి ఈ మంత్రి  మండలిలో స్థానం లభించింది.
	
	ఆంధ్ర ప్రదేశ్ నుంచి: వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వెంకయ్య నాయుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అశోక్ గజపతి రాజు టిడిపి తరపున విజయనగం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యురాలు కాదు.
	
	మహిళా మంత్రులు: సుష్మాస్వరాజ్, ఉమా భారతి, నజ్మా హెప్తుల్లా, హర్స్మిత్ కౌర్, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
	
	ఈ రోజు కేంద్ర మంత్రులుగా  ప్రమాణస్వీకారం చేసినవారు:
	
	1.నరేంద్ర మోడీ
	2.రాజ్నాథ్ సింగ్
	3. సుష్మాస్వరాజ్
	4. అరుణ్ జైట్లీ
	5. వెంకయ్య నాయుడు
	6. నితిన్ జయరామ్ గడ్కరీ
	7. డివి సదానంద్ గౌడ
	8. ఉమా భారతి
	9. నజ్మా హెప్తుల్లా
	10. గోపినాథ్ ముండే
	11. రామ్ విలాస్ పాశ్వాన్
	12. కల్రాజ్ మిశ్రా
	13. మేనకా సంజయ్ గాంధీ
	14. అనంత కుమార్
	15. రవిశంకర్ ప్రసాద్
	16. అశోక్ గజపతిరాజు
	17 అనంత్ గీతే
	18 హర్స్మిత్ కౌర్
	19. నరేంద్ర సింగ్ తోమర్
	20. జ్యూల్ ఓరమ్
	21. రాధా మోహన్ సింగ్
	22.తవర్ చంద్ గెహ్లాట్
	23. స్మృతి ఇరానీ
	24.డాక్టర్ హర్షవర్ధన్
	25. జనరల్ వికె సింగ్
	26. రావ్ ఇంద్రజిత్,
	27. సంతోష్ గ్యాంగ్వర్
	28. శ్రీపాద్ నాయక్
	29.ధర్మేంద్ర ప్రధాన్
	30. శర్వానంద్ సొనోవాల్
	31. ప్రకాష్ జవదేకర్
	32. పీయూష్ జయప్రకాష్ గోయల్
	33.డాక్టర్ జితేంద్ర సింగ్
	34.నిర్మలా సీతారామన్
	35.గౌడర్ మల్లికార్జునప్ప సిద్దేశ్వర
	36.మనోజ్ సిన్హా
	37.నిహాల్ చంద్
	38. సిపి రాధాకృష్ణన్
	39. క్రిషన్ పాల్ గుజర్
	40.డాక్టర్ సంజీవ్ కుమార్ బాలియా
	41.వాసవ మున్సుక్ భాయ్ ధనాజీభాయ్
	42.రావు సాహేబ్ దాదారావ్ పటేల్
	43.సుదర్శన్ భగత్
	44.ఉపేంద్ర కుష్వాహా
	45.విష్ణుదేవ్ సాయి
	46.కిరణ్ రిజిజు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
