జైట్లీ బడ్జెట్ జువెలరీ ఇండస్ట్రీకి నచ్చలేదా? | Cash transaction limit to hit rural jewellery business | Sakshi
Sakshi News home page

జైట్లీ బడ్జెట్ జువెలరీ ఇండస్ట్రీకి నచ్చలేదా?

Feb 2 2017 11:07 AM | Updated on Aug 20 2018 5:20 PM

బడ్జెట్లో అన్ని రంగాలను అంతో ఇంతో పట్టించుకుంటూ వచ్చిన ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ జువెలరీని పూర్తిగా విస్మరించారు.

ముంబై : బడ్జెట్లో అన్ని రంగాలను అంతో ఇంతో పట్టించుకుంటూ వచ్చిన ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ జువెలరీని పూర్తిగా విస్మరించారు. కనీసం వారి డిమాండ్లు పట్టించుపోగా, ఆభరణ వర్తకులకు మరింత దెబ్బకొట్టేలా నగదు లావాదేవీలపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై జెమ్స్, జువెలరీ ఇండస్ట్రి పెదవి విరుస్తోంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని అధిక స్థాయిలో ఉన్న 10 శాతం నుంచి తగ్గించాలని ఎన్నో రోజులుగా ఇండస్ట్రి అడుగుతున్న ప్రతిపాదనను జైట్లీ కనీసం పట్టించుకోనే లేదు.  మరోవైపు రూ.3,00,000 మించి నగదు లావాదేవీలను అనుమతించబోమని అరుణ్ జైట్లీ తీసుకున్న నిర్ణయం గ్రామీణ ఆభరణ వ్యాపారాలకు మరింత దెబ్బకొడుతుందని వర్తకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
 
ముందు వరకు నగదు లావాదేవీలపై ఎలాంటి నిబంధనలు లేవు. కానీ రూ.5,00,000 కంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగితే మూలం వద్ద పన్ను వసూళ్లు పేరుమీద 1 శాతం చార్జీని వసూలు చేసేవారు. కానీ ప్రస్తుత బడ్జెట్ లో రూ.3,00,000 కంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలను అనుమతించబోమనే జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని జువెలరీ విక్రయాలపై తీవ్ర ప్రభావం పడనుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్‌) సభ్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు చెక్ల సౌకర్యం, డిజిటల్ కంప్లైంట్ లేవని పేర్కొంటున్నారు. ఆభరణాల విక్రయాలకు గ్రామీణ ప్రాంత విక్రయాలే మంచి లాభాలను చేకూరుస్తున్నాయన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement