కెనడా ప్రధాని క్షేమం, పార్లమెంట్ మూసివేత! | Canada Prime Minister safe in firing | Sakshi
Sakshi News home page

కెనడా ప్రధాని క్షేమం, పార్లమెంట్ మూసివేత!

Oct 22 2014 9:06 PM | Updated on Sep 2 2017 3:15 PM

కెనడా ప్రధాని క్షేమం, పార్లమెంట్ మూసివేత!

కెనడా ప్రధాని క్షేమం, పార్లమెంట్ మూసివేత!

ఒట్టావో నగరంలోని పార్లమెంట్ భవనంపై అగంతకుడు జరిగిన కాల్పుల్లో కెనడా ప్రధాని స్టీఫెన్ క్షేమంగా బయటపడ్డారు.

కెనడా: ఒట్టావో నగరంలోని పార్లమెంట్ భవనం వద్ద జరిగిన కాల్పుల ఘటన నుంచి కెనడా ప్రధాని స్టీఫెన్ క్షేమంగా బయటపడ్డారు. పార్లమెంట్ ఆవరణలో దుండగుడు సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలిసింది. అగంతకుడు కాల్పులు జరిపినపుడు పార్లమెంట్ భవనంలోనే ప్రధాని స్టీఫెన్ ఉన్నారు. ఆ తర్వాత ప్రధానిని భద్రతా సిబ్బంది క్షేమంగా బయటకు పంపించినట్టు తెలుస్తోంది. 
 
కెనడా యుద్ధ స్మారక స్తూపం వద్ద విధుల్లో ఉన్న సైనికుడిపై దుండుగుడు కాల్పులు జరుపుతూ పరుగెత్తిన అగంతుకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కెనడా పార్లమెంట్ ను మూసివేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement