చేతులు మారిన బిజినెస్ వరల్డ్ పత్రిక | bussiness world magzine take over by ABP Group | Sakshi
Sakshi News home page

చేతులు మారిన బిజినెస్ వరల్డ్ పత్రిక

Sep 20 2013 12:54 AM | Updated on Sep 1 2017 10:51 PM

బిజినెస్ మ్యాగజీన్‌లలో దేశంలోనే రెండో పురాతన పత్రిక ‘బిజినెస్ వరల్డ్‌‘ను కోల్‌కతాకు చెందిన ఏబీపీ గ్రూప్ విక్రయించింది.

 న్యూఢిల్లీ: బిజినెస్ మ్యాగజీన్‌లలో దేశంలోనే రెండో పురాతన పత్రిక ‘బిజినెస్ వరల్డ్‌‘ను కోల్‌కతాకు చెందిన ఏబీపీ గ్రూప్ విక్రయించింది. అనురాగ్ బాత్రా, విక్రమ్ ఝున్‌ఝున్‌వాలాలు కొనుగోలు చేసినట్లు ఏబీపీ పేర్కొన్నప్పటికీ డీల్ విలువను వెల్లడించలేదు. ఏబీపీ గ్రూప్ ప్రధాన ప్రచురణల్లో బెంగాలీ దినపత్రిక ఆనంద్ బజార్‌తోపాటు, ఇంగ్లీష్ దినపత్రిక ద టెలిగ్రాఫ్ ఉన్నాయి. కాగా, బిజినెస్ వరల్డ్ ప్రచురణను 1981లో మొదలుపెట్టారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement