breaking news
bussiness magzine
-
కిలాడి నంబర్ 4
బాలీవుడ్ కిలాడి (అక్షయ్‌ని ముంబైలో అలానే అంటారు) అక్షయ్ కుమార్ ఫోర్బ్స్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. అమెరికన్ బిజినెస్ మ్యాగజీన్ ఫోర్బ్స్ 2019 ఏడాదికిగాను అత్యధిక సంపాదన ఉన్న నటుల జాబితాను ప్రకటించింది. గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు నటుల సంపాదనను వివిధ కొలమానాల ఆధారంగా చేసుకుని ఈ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 65 మిలియన్ డాలర్ల (దాదాపు 460 కోట్ల రూపాయలు) సంపాదనతో ఈ జాబితాలో అక్షయ్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచారు. హాలీవుడ్ స్టార్ యాక్టర్ డ్వేన్ జాన్సన్ 89.4 మిలియన్ డాలర్ల సంపాదనతో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 76.4 మిలియన్ డాలర్లతో క్రిస్ హెమ్స్‌వర్త్ రెండో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో రాబర్ట్ డౌనీ జూనియర్, జాకీ చాన్, బ్రాడ్లీ కూపర్, ఆడమ్ సాండ్లర్, క్రిస్ ఇవాన్స్, పాల్ రూడ్, విల్ స్మిత్‌లు వరుస క్రమంలో చోటు సంపాదించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన జార్జి క్లూనే ఈసారి చోటు సంపాదించుకోలేకపోయారు. మరోవైపు 2015 తర్వాత బ్రాడ్లీ కపూర్ ఈ జాబితాలో తిరిగి స్థానం సంపాదించుకోవడం విశేషం. -
చేతులు మారిన బిజినెస్ వరల్డ్ పత్రిక
న్యూఢిల్లీ: బిజినెస్ మ్యాగజీన్లలో దేశంలోనే రెండో పురాతన పత్రిక ‘బిజినెస్ వరల్డ్‘ను కోల్‌కతాకు చెందిన ఏబీపీ గ్రూప్ విక్రయించింది. అనురాగ్ బాత్రా, విక్రమ్ ఝున్‌ఝున్‌వాలాలు కొనుగోలు చేసినట్లు ఏబీపీ పేర్కొన్నప్పటికీ డీల్ విలువను వెల్లడించలేదు. ఏబీపీ గ్రూప్ ప్రధాన ప్రచురణల్లో బెంగాలీ దినపత్రిక ఆనంద్ బజార్‌తోపాటు, ఇంగ్లీష్ దినపత్రిక ద టెలిగ్రాఫ్ ఉన్నాయి. కాగా, బిజినెస్ వరల్డ్ ప్రచురణను 1981లో మొదలుపెట్టారు.