భారత్ జీడీపీ అంచనాలు కట్ | BNP Paribas cuts India's GDP forecast sharply to 3.7 per cent | Sakshi
Sakshi News home page

భారత్ జీడీపీ అంచనాలు కట్

Aug 29 2013 1:17 AM | Updated on Sep 1 2017 10:12 PM

భారత్ జీడీపీ అంచనాలు కట్

భారత్ జీడీపీ అంచనాలు కట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను 3.7 శాతానికి కుదిస్తున్నట్లు ఫ్రాన్స్‌కి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్‌పీ పారిబా వెల్లడించింది.

న్యూఢిల్లీ:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను 3.7 శాతానికి కుదిస్తున్నట్లు ఫ్రాన్స్‌కి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్‌పీ పారిబా వెల్లడించింది. గతంలో ఇది 5.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. చిన్నపాటి అలజడి వేగంగా పెను సంక్షోభం స్థాయికి పెరిగిపోతోన్న నేపథ్యంలో వృద్ధి అంచనాలు తగ్గించినట్లు బీఎన్‌పీ తెలిపింది. రూపాయి బలహీనత, విద్యుత్ వ్య యాలు పెరిగిపోతుండటం, విధానపరమైన అనిశ్చితి ఇందుకు కారణమవుతున్నాయని వివరించింది. వచ్చే 6-9 నెలల్లో సమస్యలు తీవ్రరూపు దాలుస్తాయని పేర్కొంది. 2014-15లో పరిస్థితులు కాస్త మెరుగై జీడీపీ వృద్ధి 5.3 శాతంగా ఉండొచ్చని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement