ఆయన బర్త్‌డేను ‘బీసీడే’ గా గుర్తించాలి | BC day to be recognised as Krishnaiah's birthday | Sakshi
Sakshi News home page

ఆయన బర్త్‌డేను ‘బీసీడే’ గా గుర్తించాలి

Sep 12 2015 10:37 PM | Updated on Nov 9 2018 4:32 PM

విద్యార్థి దశ నుంచే బీసీల సంక్షేమం కోసం ఉద్యమబాటను ఎంచుకున్న కృష్ణయ్య పుట్టినరోజును బీసీ కులసంఘాలు, బీసీ శ్రేణులు ‘బీసీడే’గా గుర్తించి సంఘసేవా కార్యక్రమాలను చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు.

హైదరాబాద్: విద్యార్థి దశ నుంచే బీసీల సంక్షేమం కోసం ఉద్యమబాటను ఎంచుకున్న కృష్ణయ్య పుట్టినరోజును బీసీ కులసంఘాలు, బీసీ శ్రేణులు ‘బీసీడే’గా గుర్తించి సంఘసేవా కార్యక్రమాలను చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. కృష్ణయ్యకోసం ఎవరూ పూలగుత్తులు, శాలువాలు తేకుండా అదే డబ్బును పేద విద్యార్థుల పుస్తకాలు, దుస్తుల కోసం వినియోగించాలని, ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడేలా రక్తదానశిబిరాలను ఏర్పాటుచేయాలని శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. బీసీ ఉద్యమనేత ఆర్. కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వివిధ సామాజికసేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement