ఘనవిజయం దిశగా సూచీ పార్టీ | aung san suu kyi party wins 35 of 36 seats declared | Sakshi
Sakshi News home page

ఘనవిజయం దిశగా సూచీ పార్టీ

Nov 9 2015 7:03 PM | Updated on Sep 3 2017 12:17 PM

ఘనవిజయం దిశగా సూచీ పార్టీ

ఘనవిజయం దిశగా సూచీ పార్టీ

మయన్మార్ ఎన్నికల్లో ఊహించినట్లే ప్రతిపక్ష నేత, పోరాట యోధురాలు ఆంగ్ సాన్ సూచీ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది.

యాంగాన్: మయన్మార్ ఎన్నికల్లో ఊహించినట్లే ప్రతిపక్ష నేత, పోరాట యోధురాలు ఆంగ్ సాన్ సూచీ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. 36 స్థానాల్లో ఫలితాలు ప్రకటించగా అంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ 35 సీట్లను కైవసం చేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరుగుతోంది. దాదాపు పాతికేళ్ల తర్వాత మయన్మార్‌లో తొలిసారి స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి.

ప్రస్తుతం ఆ దేశంలో యూనియన్ సాలిడారిటీ డెవలప్ మెంట్ (యూఎస్ డీపీ) అధికారంలో ఉన్నప్పటికీ దానిని నడిపించేది మాత్రం సైనికశక్. హ్లుతా గా పిలిచే మయన్మార్ పార్లమెంటులో 440మంది సభ్యులుండే ప్రతినిధుల సభ, 224మంది సభ్యులుండే వివిధ జాతుల సభ ఉంటాయి. ఈ 664 స్థానాల్లో 75 శాతం స్థానాలకు మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించారు. అంటే ప్రతినిధుల సభలోని 330 స్థానాలకూ...జాతుల సభలోని 168 స్థానాలకూ ప్రజలు ఓట్లు వేశారు. మిగిలిన 25 శాతం స్థానాలూ(166) సైన్యానివే. పార్లమెంటు ఏ రాజ్యాంగ సవరణను ఆమోదించినా దాన్ని వీటో చేసే అధికారం సైనిక ప్రతినిధులకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement