breaking news
democratic elections
-
తప్పులను వ్యతిరేకించడం, ఎత్తి చూపడం, గద్దెదించడం ఇదే ప్రతిపక్షం పని: కాంగ్రెస్
న్యూఢిల్లీ: యువతను వాడుకుంటూ దేశ రాజధాని ఢిల్లీలో అరాచక పరిస్థితులను సృష్టించడం ద్వారా బంగ్లాదేశ్‌లో మాదిరిగా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్, ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రజాస్వామ్యంలో ‘ప్రభుత్వం చేసే తప్పులను వ్యతిరేకించడం, ఎత్తిచూపడం, గద్దెదించడం’ఇవే ప్రతిపక్షాలు చేయాల్సిన పని అంటూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ సందర్భంలో పేర్కొన్న వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికింది. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను సమీకరించడం, రాజ్యాంగ సంస్థలు, స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల విధానం, ప్రజా సార్వభౌమత్వంపై మాత్రమే తమకు విశ్వాసముందని తెలిపింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై గత వందేళ్లుగా తాము పోరాటం సాగిస్తున్నామంది. రాజ్యాంగవిరుద్ధంగా అధికారం చేపట్టడాన్ని తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని చెప్పింది. మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, ఆ పార్టీ మీడియా ఇన్చార్జి పవన్ ఖేరా ఈ మేరకు సమాధానమిచ్చారు. ‘ఎప్పుడైనా, ఎవ్వరైనా ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బదులుగా ప్రత్యారోపణలు చేయడం, కుట్ర సిద్ధాంతాలను తెరపైకి తేవడం మోదీ ప్రభుత్వానికి మామూలై పోయిందన్నారు. ‘దేశంలో వరుస ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ప్రభుత్వం ఎందుకు కొనసాగనిస్తోంది? ఆయన్ను విధుల నుంచి ఎందుకు తొలగించలేదు?’అని పవన్ ఖేరా ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం గత, భవిష్యత్తుల గురించి మాత్రమే మాట్లాడుతుందన్న విషయం ఇప్పుడు దేశంలోని ప్రజలందరికీ తెలిసిపోయిందని తెలిపారు. ‘ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వర్సిటీలు, ఎన్నికల సంఘం, పరిపాలన యంత్రాంగం ఇలా.. అన్ని రంగాలపైనా పట్టుసాధించింది. దీనినే ’పాలనా వ్యవస్థ’ (రెజిమ్) అంటారు. దీనిని మార్చాలనే మేం మాట్లాడుతున్నాం. కచ్చితంగా మారుస్తాం. ఆర్ఎస్ఎస్, రిజిస్టర్ కాని ఒక సంస్థ యావత్ వ్యవస్థపై నాగుపాములా చుట్టుకుపోయినప్పుడు, మేం తోక ఊపుతూ కేవలం ప్రతిపక్షంలా కూర్చోలేం’అని ఆయన స్పష్టం చేశారు. తీవ్ర అసహనంతో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజలకు ’దిమాగీ నక్సల్’, ’దేశద్రోహి’, ’వామపక్ష వాది’ అంటూ ము ద్రవేస్తోందన్నారు. ‘తాము పతన దశలో ఉన్నట్లు ప్రభుత్వానికి అర్థమవుతోంది. తమ బండారం ప్రజల ముందు బట్టబయలైందని తెలిసిపోయింది‘ అని ఖేరా అన్నారు. ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించడం, సంస్కరణలను డిమాండ్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి కాదని తెలిపారు. ఒక ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో మార్చాలని కోరడం తిరుగుబాటు కూడా కాదని ఖేరా స్పష్టం చేశారు. -
ఘనవిజయం దిశగా సూచీ పార్టీ
యాంగాన్: మయన్మార్ ఎన్నికల్లో ఊహించినట్లే ప్రతిపక్ష నేత, పోరాట యోధురాలు ఆంగ్ సాన్ సూచీ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. 36 స్థానాల్లో ఫలితాలు ప్రకటించగా అంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ 35 సీట్లను కైవసం చేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరుగుతోంది. దాదాపు పాతికేళ్ల తర్వాత మయన్మార్‌లో తొలిసారి స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఆ దేశంలో యూనియన్ సాలిడారిటీ డెవలప్ మెంట్ (యూఎస్ డీపీ) అధికారంలో ఉన్నప్పటికీ దానిని నడిపించేది మాత్రం సైనికశక్. హ్లుతా గా పిలిచే మయన్మార్ పార్లమెంటులో 440మంది సభ్యులుండే ప్రతినిధుల సభ, 224మంది సభ్యులుండే వివిధ జాతుల సభ ఉంటాయి. ఈ 664 స్థానాల్లో 75 శాతం స్థానాలకు మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించారు. అంటే ప్రతినిధుల సభలోని 330 స్థానాలకూ...జాతుల సభలోని 168 స్థానాలకూ ప్రజలు ఓట్లు వేశారు. మిగిలిన 25 శాతం స్థానాలూ(166) సైన్యానివే. పార్లమెంటు ఏ రాజ్యాంగ సవరణను ఆమోదించినా దాన్ని వీటో చేసే అధికారం సైనిక ప్రతినిధులకుంటుంది. -
మయన్మార్ ఎన్నికల్లో సూచీదే విజయం!
మయన్మార్ ఎన్నికల్లో ముందునుంచి ఊహించినట్లే ప్రతిపక్ష నేత, పోరాట యోధురాలు ఆంగ్ సాన్ సూచీ పార్టీ ఘన విజయం సాధించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం మొదలైంది. ఇంతవరకు అధికారికంగా ఫలితాలేవీ వెలువడకపోయినా, అధికార యూఎస్డీపీ నాయకుడు హెచ్‌టే ఊ తమ ఓటమిని అంగీకరించారు. ''మేం ఓడిపోయాం'' అని ఆయన చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. దాదాపు పాతికేళ్ల తర్వాత మయన్మార్‌లో తొలిసారి స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనాలను బట్టి ఎలాంటి భేషజాలకు పోకుండా తమ పరాజయాన్ని అంగీకరిస్తున్నామని, అయితే తుది ఫలితాలు ఇంకా తెలియలేదని యూఎస్డీపీ నేత అన్నారు. తన సొంత నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీతో సూచీ పార్టీ విజయం సాధించడం ఆశ్చర్యం కలిగించిందని ఊ చెప్పారు. తమ ప్రాంతంలో ప్రజల అభివృద్ధికి చాలా చేశామని, అయితే వాళ్ల నిర్ణయం మాత్రం వేరేగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


