ఇస్రో.. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్(షార్) నుంచి వచ్చేనెల ఆస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.
సూళ్లూరుపేట: ఇస్రో.. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్(షార్) నుంచి వచ్చేనెల ఆస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఈ నెల27న జీఎస్‌ఎల్‌వీ-డీ6 రాకెట్ ద్వారా జీశాట్-6 ఉపగ్రహాన్ని నింగికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ30 ద్వారా వచ్చే నెల ఆస్ట్రోశాట్ ప్రయోగానికీ సన్నద్ధం అవుతోంది. జీఎస్‌ఎల్‌వీ-డీ6 ప్రయోగానికి షార్ రెండో రాకెట్ ప్రయోగవేదిక పై, పీఎస్‌ఎల్‌వీ-సీ30 ప్రయోగానికి మొదటి ప్రయోగవేదికపై సన్నాహాలు చేస్తున్నారు.
జీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి సంబంధించి.. మరో రెండు రోజుల్లో ఉపగ్రహాన్ని రాకెట్‌కు అమర్చనున్నారు. తర్వాత 18వ తేదీన వ్యాబ్ నుంచి రాకెట్‌ను ప్రయోగవేదిక మీదకు చేర్చే ప్రక్రియను చేపట్టనున్నారు. అనంతరం 27న సాయంత్రం 4.20 గంటలకు ప్రయోగం జరగనుంది. అదేవిధంగా ఆస్ట్రోశాట్ ఉపగ్రహం కూడా మరో రెండు వారాల్లో షార్‌కు చేరుకోనుందని షార్ వర్గాలు తెలిపాయి.