breaking news
Satish dhavan Space Center
-
పీఎస్ఎల్వీ సీ–62 ప్రయోగంలో విఫలం: ఇస్రో ప్రకటన
సాక్షి, సూళ్లూరుపేట: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ–62 ఉపగ్రహ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో అవాంతరాలు ఎదురయ్యాయి. రాకెట్ ప్రయోగం నాలుగో దశలో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయాయి. 18 నిమిషాలకే ప్రయోగం పూర్తి కావాల్సి ఉండగా.. శాటిలైట్‌తో లింగ్ తెగిపోయినట్టు ఇస్రో అధికారులు గుర్తించారు. దీంతో, ప్రయోగం విఫలమైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వీ. నారాయణన్ మాట్లాడుతూ.. ప్రయోగంలో సాంకేతిక లోపం గుర్తించాం. అన్వేష ప్రయోగంలో అవాంతరాలు ఎదురయ్యాయి. రాకెట్ ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. డేటా విశ్లేషిస్తున్నాం. 18 నిమిషాలకే ప్రయోగం పూర్తి కావాల్సింది. కానీ, అలా జరగలేదు. నాలుగో దశ ప్రారంభంలోనే శాటిలైట్‌తో లింక్ తెగిపోయింది అని తెలిపారు. లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టి, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. Third Stage failure confirmed. pic.twitter.com/SMjrshHUgC— NSF - NASASpaceflight.com (@NASASpaceflight) January 12, 2026 ఇక, ఈ ప్రయోగం ద్వారా 1,485 కిలోల బరువు కలిగిన ఈఓఎస్–ఎన్1 (అన్వేష) ఉపగ్రహాన్ని, మరో 15 చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైనది. అలాగే, ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగ్రం ఇదే. #WATCH | Sriharikota, Andhra Pradesh: The PSLV-C62/EOS-N1 mission launches from Satish Dhawan Space Centre (SDSC-SHAR).PSLV-C62 will carry EOS-N1 and 15 co-passenger satellites. EOS-N1 and 14 co-passengers are planned for injection into Sun Synchronous Orbit; the KID capsule is… pic.twitter.com/b4mrfQMTM2— ANI (@ANI) January 12, 2026ఈ చిన్న ఉపగ్రహాల్లో మనదేశంలోని మూడు స్టార్టప్ కంపెనీలకు చెందిన ఏడు, విదేశాలకు చెందిన ఎనిమిది ఉన్నాయి. వీటిని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ పర్యవేక్షణలో వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నారు. రాకెట్ ప్రయోగించిన తరువాత 17.54 నిమిషాలకు స్పెయిన్ దేశానికి చెందిన బుల్లి ఉపగ్రహం మినహా మిగిలిన ఉపగ్రహాలను భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. Launch of PSLV-C62 / EOS-N1 Mission | @isro https://t.co/hcKKNRQfx0— Ministry of Information and Broadcasting (@MIB_India) January 12, 2026ఈ దఫా రాకెట్‌లోని నాలుగోదశ (పీఎస్–4)తో కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత రాకెట్‌లోని నాలుగోదశను క్రమేణ కిందకు దించుతూ రెండుసార్లు రీస్టార్ట్ చేస్తారు. ఆ తరువాత స్పెయిన్‌లోని స్పానిష్ స్టార్టప్ సంస్థకు చెందిన కెస్ట్రెల్ ఇనిషియల్ టెక్నాలజీ, డిమాన్స్ట్రేటర్ (కిడ్) అనే పేలోడ్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెడతారు. అనంతరం అది భూ వాతావరణంలోకి ప్రవేశించి దక్షిణ ఫసిఫిక్ మహాసముద్రంలో పడిపోయే విధంగా ప్రణాళిక రూపొందించారు. డీఆర్డీవో రూపొందించిన ఈఓఎస్–ఎన్1 పీఎస్ఎల్వీ సీ–62 ద్వారా ప్రయోగించనున్న ఈఓఎస్–ఎన్1 (అన్వేష్) ఉపగ్రహాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించింది. దీన్ని ప్రధానంగా దేశ రక్షణ కోసం ఉపయోగించనున్నారు. గూఢచారి ఉపగ్రహాల కుటుంబంలో ఇది అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉపగ్రహం. -
వచ్చే నెలలో ఆస్ట్రోశాట్ ప్రయోగం
సూళ్లూరుపేట: ఇస్రో.. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్(షార్) నుంచి వచ్చేనెల ఆస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఈ నెల27న జీఎస్ఎల్వీ-డీ6 రాకెట్ ద్వారా జీశాట్-6 ఉపగ్రహాన్ని నింగికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఇస్రో పీఎస్ఎల్వీ-సీ30 ద్వారా వచ్చే నెల ఆస్ట్రోశాట్ ప్రయోగానికీ సన్నద్ధం అవుతోంది. జీఎస్ఎల్వీ-డీ6 ప్రయోగానికి షార్ రెండో రాకెట్ ప్రయోగవేదిక పై, పీఎస్ఎల్వీ-సీ30 ప్రయోగానికి మొదటి ప్రయోగవేదికపై సన్నాహాలు చేస్తున్నారు. జీఎస్ఎల్వీ ప్రయోగానికి సంబంధించి.. మరో రెండు రోజుల్లో ఉపగ్రహాన్ని రాకెట్‌కు అమర్చనున్నారు. తర్వాత 18వ తేదీన వ్యాబ్ నుంచి రాకెట్‌ను ప్రయోగవేదిక మీదకు చేర్చే ప్రక్రియను చేపట్టనున్నారు. అనంతరం 27న సాయంత్రం 4.20 గంటలకు ప్రయోగం జరగనుంది. అదేవిధంగా ఆస్ట్రోశాట్ ఉపగ్రహం కూడా మరో రెండు వారాల్లో షార్కు చేరుకోనుందని షార్ వర్గాలు తెలిపాయి. -
షార్ డెరైక్టర్‌గా కున్హికృష్ణన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన డెరైక్టర్‌గా కేరళ రాష్ట్రానికి చెందిన కున్హికృష్ణన్ నియమితులైనట్టుగా బెంగళూరులోని అంతరిక్ష ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటిదాకా షార్ డెరైక్టర్‌గా కొనసాగిన డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పీఎస్ఎల్వీ వెహికల్ డెరైక్టర్‌గా ఉన్న కున్హికృష్ణన్ షార్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. జూన్ 1న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 51 ఏళ్ల కున్హికృష్ణన్ షార్ డెరైక్టర్ అయిన అతి చిన్న వయస్కుడు. అయితే తెలుగు వారైన ఎంవైఎస్ ప్రసాద్ ఇస్రోకు ఎన్నో సేవలు అందించి ఎంతో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. తాజాగా షార్‌లో మల్టీ అబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ సెంటర్ పనులను కూడా ఆయన ఆధ్వర్యంలోనే పూర్తిచేశారు. ఇంతటి సీనియర్ శాస్త్రవేత్త ఉద్యోగ విరమణ చేస్తున్నా.. ఇస్రోలో ఏదో ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వకుండా పంపేస్తుండటంపై షార్ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి.


