11 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు! | Around the world in 11 days: Russian adventurer, 65, sets new record | Sakshi
Sakshi News home page

11 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు!

Jul 23 2016 6:23 PM | Updated on Sep 4 2017 5:54 AM

రష్యాకు చెందిన 65 ఏళ్ల సాహసి ఫెడర్ హాట్ ఎయిర్ బెలూన్ లో 11 రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు..

పెర్త్: 'సాహసం నా పథం.. రాజసం నా రథం.. సాగితే ఆపడం సాధ్యమా..' అని పాడుకుంటూ కేవలం 11 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు ఓ 65 ఏళ్ల పెద్దాయన! పేరు ఫెడర్ కాంకోవ్. దేశం రష్యా. చిన్నప్పటి నుంచి సాహసాలంటే చెవికోసుకునే ఫెడర్..  విధివశాత్తు మతబోధకుడయ్యారు. రష్యాలోని ఓ ఆర్థోడాక్స్ చర్చీలో ఫాదర్ గా పనిచేస్తున్న ఆయన  సాహస ప్రవృత్తిని మాత్రం వదులుకోలేదు. ఏమాత్రం సమయం చిక్కినా హాట్ ఎయిర్ బెలూన్ లో అకాశంలోకి వెళ్లి సరదాగా విహరించేవాడు. 'ఒక్కసారైనా ప్రపంచాన్ని చుట్టివచ్చే అవకాశం ఇవ్వు'అని దేవుణ్ని ప్రార్థించాడు. దయగల ప్రభువు ఫెడర్ కోరికను మన్నించాడు.

దాదాపు రెండు టన్నుల బరువు, 56 మీటర్ల పొడవు, హీలియంతో నడిచే భారీ హాట్ ఎయిర్ బెలూన్ లో పెర్త్ (ఆస్ట్రేలియా) నుంచి జులై 12న  బయలుదేరిన ఫెడర్.. ప్రపంచాన్ని చుట్టేసి, సరిగ్గా 11 రోజుల ఆరు గంటలకు తిరిగి బయలుదేరిన చోటికి చేరుకున్నాడు. 23వేల అడుగుల ఎత్తులో.. విపత్కర వాతావరణాన్ని ఎదుర్కొంటూ, గాలులకు తట్టుకుంటూ, నిద్రలేమితో ఒంటరిగా ప్రయాణించిన ఫెడర్.. అతి తక్కువ సమయంలో గ్లోబ్ ని చుట్టొచ్చిన సాహసిగా రికార్డు సృష్టించాడు. గతంలో అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ లోనే 13 రోజుల ఎనిమిది గంటల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement