ఆర్మీ, వైమానిక దళాలకు డిప్యూటీ చీఫ్‌ల నియామకం | Army, Air Force get new deputy chiefs | Sakshi
Sakshi News home page

ఆర్మీ, వైమానిక దళాలకు డిప్యూటీ చీఫ్‌ల నియామకం

Apr 30 2014 11:18 PM | Updated on Sep 2 2017 6:44 AM

దేశ సైనిక, వైమానిక దళాలకు నూతన ఉప ప్రధానాధికారులు(డిప్యూటీ చీఫ్) నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: దేశ సైనిక, వైమానిక దళాలకు నూతన ఉప ప్రధానాధికారులు(డిప్యూటీ చీఫ్) నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ సి.ఎ. క్రిష్ణన్(58) సైనిక దళాల ఉప ప్రధానాధికారిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ నరేంద్ర సింగ్ రిటైర్ కావడంతో ఈ పదవి ఖాళీ అయింది.

దాదాపు 40 ఏళ్లపాటు నరేంద్ర సింగ్ సైనిక దళాల్లో సేవలందించారు. మరోపక్క, ఎయిర్ మార్షల్ ఎస్‌బీపీ సిన్హా(58) వైమానికి దళ ఉప ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. వైమానిక దళ ఆధునికీకరణలో ఈయన ప్రముఖ పాత్ర పోషించనున్నారు.

Advertisement

పోల్

Advertisement