breaking news
airforce deputy chief
-
ఎయిర్‌ఫోర్స్ తదుపరి చీఫ్ అమర్‌ప్రీత్‌సింగ్
న్యూఢిల్లీ:ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తదుపరి చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు.అమర్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలో ముగియనుంది.దీంతో అమర్‌ప్రీత్ సింగ్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం(సెప్టెంబర్21) ఒక ప్రకటన విడుదల చేసింది. 1964 అక్టోబరు 27న జన్మించిన ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ,డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.1984 డిసెంబర్లో ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశించారు.దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్లో అత్యంత అనుభవజ్ఞుడైన ఫ్లైయర్‌గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా అమర్‌ప్రీత్‌సింగ్ గుర్తింపు పొందారు.ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.ఇదీ చదవండి.. భారత వృద్ధికి కీలక చర్చలు : పియూష్ గోయెల్ -
ఆర్మీ, వైమానిక దళాలకు డిప్యూటీ చీఫ్‌ల నియామకం
న్యూఢిల్లీ: దేశ సైనిక, వైమానిక దళాలకు నూతన ఉప ప్రధానాధికారులు(డిప్యూటీ చీఫ్) నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ సి.ఎ. క్రిష్ణన్(58) సైనిక దళాల ఉప ప్రధానాధికారిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ నరేంద్ర సింగ్ రిటైర్ కావడంతో ఈ పదవి ఖాళీ అయింది. దాదాపు 40 ఏళ్లపాటు నరేంద్ర సింగ్ సైనిక దళాల్లో సేవలందించారు. మరోపక్క, ఎయిర్ మార్షల్ ఎస్బీపీ సిన్హా(58) వైమానికి దళ ఉప ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. వైమానిక దళ ఆధునికీకరణలో ఈయన ప్రముఖ పాత్ర పోషించనున్నారు.