గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట ఘటనపై పౌరహక్కుల సంఘం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.
హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట ఘటనపై పౌరహక్కుల సంఘం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. పుష్కరాలను మతపరమైన కార్యక్రమాలుగా ప్రభుత్వాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన పొలిటికల్ మైలేజీ కోసం పాకులాడటం వల్లే 29 మరణించారని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. తొక్కిసలాట మృతులను అనుమానాస్పద మరణాలుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తొక్కిసలాట ఘటనను నేరాభియోగం కింద నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది.