ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేషే.. | Akhilesh will be Samajwadi Party’s CM candidate: party MP Naresh Agarwal | Sakshi
Sakshi News home page

ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేషే..

Sep 15 2016 5:12 PM | Updated on Sep 4 2017 1:37 PM

ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేషే..

ఎస్పీ సీఎం అభ్యర్థి అఖిలేషే..

సమాజ్వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం అఖిలేష్ యాదవ్ ఉంటారని ఆ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ చెప్పారు.

లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం అఖిలేష్ యాదవ్ ఉంటారని ఆ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ చెప్పారు. ఎస్పీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ ఇంట్లో రాజకీయ ఆధిపత్యపోరు జరుగుతున్న నేపథ్యంలో నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

'ములయాం, అఖిలేష్ మార్గదర్శకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటాం. సీఎం అభ్యర్థిగా అఖిలేషే ఉంటారు' అని నరేష్ అన్నారు. పార్టీ విషయాల్లో బయటివారు ఎవరైనా జోక్యం చేసుకుంటే వెంటనే మానుకోవాలని చెప్పారు. ములయాం సోదరుడు, యూపీ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్, అఖిలేష్ మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో నరేష్.. అఖిలేష్కు మద్దతుగా మాట్లాడారు. పార్టీలో గొడవలకు బయటనుంచి వచ్చిన వ్యక్తే కారణమని అఖిలేష్ ఆరోపించిన మరుసటి రోజు నరేష్ ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా పార్టీలో బాబాయ్, అబ్బాయ్ మధ్య ఎలాంటి విబేధాలూ లేవని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement