వివాహ వేదికపై దాడి.. 26కు పెరిగిన మృతుల సంఖ్య | Airstrike kills 26 at Yemen wedding | Sakshi
Sakshi News home page

వివాహ వేదికపై దాడి.. 26కు పెరిగిన మృతుల సంఖ్య

Oct 8 2015 2:01 PM | Updated on Sep 3 2017 10:39 AM

యెమెన్లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 26కు పెరిగింది.

సనా: యెమెన్లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 26కు పెరిగింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 40 మంది గాయపడ్డారు.

బుధవారం రాత్రి దమర్ ప్రావిన్స్లో ఓ గిరిజన నాయకుడి ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆయన షీటె హౌతీ గ్రూప్నకు మద్దతుదారు. యెమెన్లో గతవారం మరో పెళ్లి బృందంపై వైమానిక దాడి జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement