ఈ దేశీయ విమానంలో ఫ్రీ వై-ఫై

ఈ దేశీయ విమానంలో ఫ్రీ వై-ఫై

న్యూఢిల్లీ : గగనతలంలో విమానం ఎగురుతున్నట్టు ఫోన్ ఆన్ చేయడమే నిబంధనలకు విరుద్ధం.  ఈ నిబంధనలన్నింటిన్నీ మార్చేస్తూ విమానాల్లో వై-ఫై వాడుకునే సౌకర్యాలను  పౌర విమానయాన సంస్థలు కల్పిస్తున్నాయి.  ఇన్నిరోజులు అంతర్జాతీయ విమానాల్లోనే ఈ సదుపాయం ఉండేది. తాజాగా దేశీయ విమానాల్లోనూ వై-ఫై సందుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ ఇండియా  ఆన్ బోర్డులో ఈ జూలై లోపల ఉచిత వై-ఫై సేవలిందించేందుకు ప్లాన్ చేస్తోంది. తన ఎయిర్ బస్ ఏ-320 విమానాలకు ఈ సదుపాయం తీసుకొస్తుందట. ఒక్కసారి ఈ ఎయిర్ బస్ లో ఉచిత వై-ఫైను విజయవంతంగా అందిస్తే, ఇదే బాటలో ఇతర ఎయిర్ లైన్ సంస్థలు పయనించనున్నాయి.

 

''మా విమానాల్లో వై-ఫై అందించేందుకు కృషిచేస్తున్నాం. వై-ఫై పరికరాలను అమర్చడానికి ఎయిర్ క్రాఫ్ట్ తయారీదారి దగ్గర్నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పటి నుంచి వై-ఫై సేవలను అందించగలమో సరియైన తేది చెప్పలేకపోతున్నాం. కానీ జూన్, జూలై మధ్యలో ఈ సేవలను ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉన్నాం'' అని ఎయిర్  ఇండియా చీఫ్ అశ్వని లోహాని చెప్పారు. అయితే ఎంత డేటా అందిస్తోందో, స్పీడు ఎలా ఉంటుందో  ఈ విమానయాన సంస్థ ప్రకటించలేదు. తొలుత బేసిక ప్యాక్ లను ఉచితంగా అందించిన తర్వాత, చెల్లింపు ప్యాక్లను ప్రారంభిస్తుందని తెలుస్తోంది. ఉచిత బేసిక్ ప్యాక్, వాట్సాప్ మెసేజ్ లు పంపడం వంటివి చేసుకోవచ్చు. దీంతో ఉచిత వై-ఫై సేవలందించే తొలి ఎయిర్ లైన్ గా ఎయిర్ ఇండియా గుర్తింపు పొందనుంది. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top