ఢిల్లీలో ఈనెల 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 38-50 సీట్లు గెలుచుకుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ధీమా వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈనెల 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 38-50 సీట్లు గెలుచుకుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ధీమా వ్యక్తం చేసింది. ఇటీవలి ‘స్టింగ్’ ఆపరేషన్‌లో తమ నేతలపై ఆరోపణలు వచ్చినా, ఈ ఎన్నికల్లో 35.6 శాతం ఓట్లు సాధించి, 38 నుంచి 50 స్థానాలను దక్కించుకుంటుందని ‘ఆప్’ నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. పార్టీ తరఫున నాలుగో విడత, ఐదో విడత చేపట్టిన సర్వే ఫలితాలను ఆదివారం ఆయన విడుదల చేశారు. ఢిల్లీలో ‘ఆప్’ అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 27 శాతం, కాంగ్రెస్‌కు 26 శాతం ఓట్లు లభిస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ నేత అరవింద్ కేజ్రీవాల్‌పైనే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు సర్వేల్లో తేలిందన్నారు.