రూ.17 లక్షలు సేకరించిన 8 ఏళ్ల బాలుడు | 8-year-old boy raises USD 26000 for Nepal earthquake victims | Sakshi
Sakshi News home page

రూ.17 లక్షలు సేకరించిన 8 ఏళ్ల బాలుడు

May 11 2015 2:09 PM | Updated on Oct 20 2018 6:37 PM

తల్లిదండ్రులతో నీవ్ సరాఫ్ - Sakshi

తల్లిదండ్రులతో నీవ్ సరాఫ్

నేపాల్ భూకంప బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు 8 ఏళ్ల బాలుడు ముందుకు వచ్చాడు.

వాషింగ్టన్: నేపాల్ భూకంప బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు 8 ఏళ్ల బాలుడు ముందుకు వచ్చాడు. భూవిలయ బాధితుల సహాయార్థం సుమారు రూ. 17 లక్షలు సేకరించాడు. అమెరికాలోని మేరీల్యాండ్ కు నీవ్ సరాఫ్ తాను దాచుకున్న డబ్బుతో పాటు ఇతరల నుంచి విరాళాలు సేకరించి ఈ మొత్తం పోగుచేశాడు. తన స్నేహితులు, వారి కుటుంబ సభ్యులను నుంచి విరాళాలు సేకరించాడు.

భూవిలయంలో అతలాకుతలమైన నేపాల్ ను చూస్తుంటే తన మనసంతా దుఃఖంతో నిండిపోయిందని పేర్కొన్నాడు. సహాయ కార్యక్రమాలకు తాను దాచుకున్న డబ్బు ఇస్తున్నానని, మిగతా వారు సాయమందించాలని విజ్ఞప్తి చేశాడు. నీవ్ సరాఫ్ బృందం రూ. 17.45 లక్షలు పోగుచేయగా అందులో నీవ్ ఒక్కడే రూ.17 లక్షలు పోగు చేశాడు. నీవ్ సరాఫ్ తల్లిదండ్రులు నేపాల్ కు చెందిన వారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement