చైనాలో భూకంపం: 43 మందికి గాయాలు
నైరుతి చైనాలోని యునాన్ ప్రావెన్స్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.1గా నమోదు అయింది.
నైరుతి చైనాలోని యునాన్ ప్రావెన్స్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.1గా నమోదు అయింది. ఆ ఘటనలో 43 మంది గాయపడ్డారని కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య నేత వాంగ్ వెల్లడించారు.భూకంపం దాటికి ప్రావెన్స్లోని దాదాపు 15 టౌన్ షిప్ల్లోని దాదాపు లక్షన్నర మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు.
వారిలో 35 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. భూకంప తీవ్రతకు 20 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. భూకంప ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను అదేశించింది. దాంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వాంగ్ వెల్లడించారు.


