పాకిస్థాన్లో 56 మంది మహిళల హతం | 56 women killed in Pakistan for giving birth to a girl rather than a boy | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్లో 56 మంది మహిళల హతం

Nov 28 2013 4:34 PM | Updated on Aug 7 2018 4:29 PM

పాకిస్థాన్లో 56 మంది మహిళల హతం - Sakshi

పాకిస్థాన్లో 56 మంది మహిళల హతం

పాకిస్థాన్లో మహిళలపై దారుణాలు నానాటికి అధికమవుతున్నాయి. చాంధస పురుషాహంకారుల దురాగతాలకు మహిళలు బలైపోతున్నారు.

లాహోర్: పాకిస్థాన్లో మహిళలపై దారుణాలు నానాటికి అధికమవుతున్నాయి. చాంధస పురుషాహంకారుల దురాగతాలకు మహిళలు బలైపోతున్నారు. ఆడ పిల్లలకు జన్మనిచ్చారనే కారణంతో ఈ ఏడాది పాకిస్థాన్లో 56 మంది మహిళలను చంపేసినట్టు హక్కుల సంఘం వెల్లడించింది. ఈ దారుణాలపై మానవ హక్కుల సంఘం ఆఫీస్ బేరర్ ఐఏ రెహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులను చంపే సమాజంగా నైతిక పతనమైనట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.

2012 జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మహిళలపై 90 యాసిడ్  దాడులు జరిగాయని గణాంకాలు వెల్లడించాయి. 72 మంది అగ్నికీలకు బలైయ్యారు. 491 గృహహింస కేసులు, 344 గ్యాంగ్ రేప్, 835 వేధింపులు కేసులు నమోదయ్యాయి. మగపిల్లలకు జన్మనివ్వలేదని 56 మంది మహిళలను హతమార్చినట్టు గణాంకాలు బయటపెట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement