మధ్యాహ్న భోజనంలో బల్లి.. 19 మందికి అస్వస్థత | 19 students fall sick after eating mid-day meal | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనంలో బల్లి.. 19 మందికి అస్వస్థత

May 24 2014 3:00 PM | Updated on Nov 9 2018 4:14 PM

ఉత్తరప్రదేశ్లోని బాలియాలో ఓ హైస్కూల్లో బల్లి పడిన మధ్యాహ్న భోజనం తిని 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

ఉత్తరప్రదేశ్లోని బాలియాలో ఓ హైస్కూల్లో బల్లి పడిన మధ్యాహ్న భోజనం తిని 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాళ్లంతా ధూపా రాంప్యారీ జూనియర్ బాలికా విద్యాలయలో 6 నుంచి 8వ తరగతి లోపు చదువుతున్నారు. అక్కడ అందిస్తున్న మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అందరికీ ఆరోగ్యం పాడవ్వడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

సోనేబస్రా ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వారిని చేర్చినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులకు పెట్టిన భోజనంలో బల్లి కనిపించినట్లు చెప్పారు. ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఒక సహాయ టీచర్, ముగ్గరు వంటవాళ్లపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను యూపీ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి రామ్ గోవింద్ చౌదరి పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement