breaking news
lizard in meals
-
టిఫిన్‌లో బల్లి
వంగర : తాము తిన్న టిఫిన్‌లో బల్లి పడిందని తెలియడంతో మండల పరిధిలోని లక్ష్మీపేట గ్రామస్తులు వంగర పీహెచ్‌సీకి ఉరుకులు పరుగులు పెట్టారు. ఫుడ్‌పాయిజనింగ్ జరగలేదని వైద్య పరీక్షల్లో తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శివ్వాం గ్రామానికి చెందిన ఓ వ్యాపారి ఎప్పటిలాగే గురువారం కూడా వివిధ రకాల ఆహార పదార్థాలు విక్రయించాడు. చెట్నీలో బల్లిపడిందనే ప్రచారం జరగడంతో టిఫిన్ చేసిన వారంతా భయంతో పీహెచ్‌సీకి హుటాహుటిన వెళ్లారు. విషయం తెలుసుకున్న ఏఎన్ఎం ఎస్.సూర్యప్రభ వారికి ప్రాథమిక చికిత్స అందించి వంగర పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి దత్తి అనీల్‌కుమార్ బోనెల చాందిని, బోనెల మౌళి, చిత్తిరి తేజేశ్వరరావు, చిత్తిని కల్పన, కలమటి హేమా, పావని, మొత్తం 22 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఫుడ్‌పాయిజన్ లక్షణాలు లేవని వైద్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకుని లక్ష్మీపేటకు వెళ్లారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని సర్పంచ్ చిత్తిరి సింహాలమ్మ తెలిపారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి.. 19 మందికి అస్వస్థత
ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో ఓ హైస్కూల్లో బల్లి పడిన మధ్యాహ్న భోజనం తిని 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాళ్లంతా ధూపా రాంప్యారీ జూనియర్ బాలికా విద్యాలయలో 6 నుంచి 8వ తరగతి లోపు చదువుతున్నారు. అక్కడ అందిస్తున్న మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అందరికీ ఆరోగ్యం పాడవ్వడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. సోనేబస్రా ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వారిని చేర్చినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులకు పెట్టిన భోజనంలో బల్లి కనిపించినట్లు చెప్పారు. ప్రధానోపాధ్యాయురాలితో పాటు ఒక సహాయ టీచర్, ముగ్గరు వంటవాళ్లపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను యూపీ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి రామ్ గోవింద్ చౌదరి పరామర్శించారు.