టిఫిన్‌లో బల్లి | Sakshi
Sakshi News home page

టిఫిన్‌లో బల్లి

Published Fri, May 18 2018 12:01 PM

Lizard In Breakfast  - Sakshi

వంగర : తాము తిన్న టిఫిన్‌లో బల్లి పడిందని తెలియడంతో మండల పరిధిలోని లక్ష్మీపేట గ్రామస్తులు వంగర పీహెచ్‌సీకి ఉరుకులు పరుగులు పెట్టారు. ఫుడ్‌పాయిజనింగ్‌ జరగలేదని వైద్య పరీక్షల్లో తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శివ్వాం గ్రామానికి చెందిన ఓ వ్యాపారి ఎప్పటిలాగే గురువారం కూడా వివిధ రకాల ఆహార పదార్థాలు విక్రయించాడు. చెట్నీలో బల్లిపడిందనే ప్రచారం జరగడంతో టిఫిన్‌ చేసిన వారంతా భయంతో పీహెచ్‌సీకి హుటాహుటిన వెళ్లారు.

విషయం తెలుసుకున్న ఏఎన్‌ఎం ఎస్‌.సూర్యప్రభ వారికి ప్రాథమిక చికిత్స అందించి వంగర పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి దత్తి అనీల్‌కుమార్‌ బోనెల చాందిని, బోనెల మౌళి, చిత్తిరి తేజేశ్వరరావు, చిత్తిని కల్పన, కలమటి హేమా, పావని, మొత్తం 22 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఫుడ్‌పాయిజన్‌ లక్షణాలు లేవని వైద్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకుని లక్ష్మీపేటకు వెళ్లారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని సర్పంచ్‌ చిత్తిరి సింహాలమ్మ తెలిపారు. 

Advertisement
Advertisement