పెషావర్లో ఆర్మీ స్కూల్పై ఉగ్రవాదులు మారణోమం సృష్టించిన నేపథ్యంలో తాలిబాన్లపై పాకిస్థాన్ సైనిక దాడులు కొనసాగుతున్నాయి.
కరాచీ: పెషావర్లో ఆర్మీ స్కూల్పై ఉగ్రవాదులు మారణోమం సృష్టించిన నేపథ్యంలో తాలిబాన్లపై పాకిస్థాన్ సైనిక దాడులు కొనసాగుతున్నాయి. ఇద్దరు తాలిబన్ కమాండర్లతో పాటు 12 మంది తీవ్రవాదులను శుక్రవారం పాకిస్థాన్ ఆర్మీ మట్టుబెట్టింది. వీరిలో ఒక విదేశీయుడు ఉన్నాడు. బలూచిస్థాన్ లోని కరాచీ, జియరాత్ జిల్లాల్లో దాడులు జరిపి తాలిబాన్లను హతమార్చింది.
ఈ తెల్లవారుజామున కరాచీలోని హక్స్ బై ప్రాంతంలో నలుగురిని, జియరాత్ జిల్లాలో 8 మంది తీవ్రవాదులను పాకిస్థాన్ రేంజర్స్ హతమార్చాయి. ఖైబర్లోని తాలిబన్ స్థావరాలపై గురువారం సైన్యం జరిపిన దాడిలో 50 మందిపైగా తీవ్రవాదులు మృతి చెందారు.