ఒక కారు..100 తుపాకులు... | 100 blank-firing pistols found in Delhi car | Sakshi
Sakshi News home page

ఒక కారు..100 తుపాకులు...

Aug 12 2014 11:45 PM | Updated on Aug 21 2018 5:46 PM

దేశ రాజధానిలో భారీ సంఖ్యలో తుపాకులను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ సంఖ్యలో తుపాకులను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానస్పద రీతిలో సంచరిస్తున్న కారు సోదా చేయగా 100 ఖాళీ పిస్టల్స్ పోలీసులకు దొరికాయి.  100 పిస్టల్స్ ను స్వాధీనం చేసుకుని కారులోని  ఉన్న ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాగ్డోలా గ్రామానికి వెళ్తుండగా దక్షిణ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో పోలీసులు కారును సోదా చేశారు. 
 
పోలీసులను గమనించిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. రెండు గోనె సంచుల్లో పిస్టల్స్ ను రవాణా చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. రేసుల్లో సాధారణంగా ఇలాంటి పిస్టల్స్ ఉపయోగిస్తారు. వీటికి లైసెన్స్ లు అవసరం అని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement