
సినీ గేయ రచయిత చంద్రబోస్
తుని: అక్షర పారిజాతాల వంటి వేలాది పాటలతో శ్రోతలను అలరించిన వేటూరి సుందరరామ్మూర్తి జయంతి సందర్భంగా తుని వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు వేటూరి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాయి. ఈ నెల 29న వేటూరి జయంతి సందర్భంగా స్థానిక చిట్టూరి మెట్రోలో వేటూరి జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నామని పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కలగా రామజోగేశ్వరశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటి వరకు 7 గురు ప్రముఖులకు వేటూరి పురస్కారాన్ని అందించామని, అష్టమ పురస్కారాన్ని చంద్రబోస్‌కు ఇస్తున్నామని తెలిపారు. వేటూరి సాహితి పీఠం గౌరవ వ్యవస్థాపక అధ్యక్షుడు తనికెళ్ల భరణి, వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కా తాతబాబు, అధ్యక్షుడు సీహెచ్‌వీకే నరసింహారావుల పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుందని శ్రీప్రకాష్ కల్చ రల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సీహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు.