మా నాన్న నన్ను ఇంజినీర్ చేయాలనుకున్నారు | Sakshi
Sakshi News home page

ఇష్టపడి చదవాలి

Published Sat, Jan 27 2018 8:08 AM

actress prema participate in republic day - Sakshi

బొమ్మనహళ్లి : విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలని, ఎవరి కోసమో చదివితే ఉపయోగం ఉండదని బహుభాషా నటి ప్రేమ అన్నారు. శుక్రవారం హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లోని సామసంద్రపాళ్యలోని శ్రీసాయిరామ్‌ విద్యా మందిర పాఠశాల 7వ వార్షికోత్సవం వేడుకల్లో ఆమె పాల్గొని జ్యోతి వెలిగించి మాట్లాడుతూ... పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రతి ఒక్కరికి అద్భుతమైన ప్రతిభ ఉంటుందని, ఉపాధ్యాయులు గుర్తించి వారిని ప్రోత్సహించాలన్నారు. తాను ఇంజినీర్‌ కావాలని తన తండ్రి కోరికని అయితే తాను సినిమా ఇండస్ట్రీలో రాణించానని గుర్తు చేశారు.

ఎమ్మెల్యే ఎం.సతీష్‌రెడ్డి మాట్లాడుతూ... స్థానిక బీజేపీ నాయకడు, సమాజ సేవకుడు   శ్రీనివాస్‌ రెడ్డి పేదలకు తక్కువ ఖర్చుతో ఉత్తమ విద్యను అందించడం కోసం ఈ పాఠశాలను స్థాపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఇక్కడి  సామసంద్రపాళ్యలోని ఓ అపార్టుమెంట్‌లో ఎస్‌టీపీ ట్యాంకు శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి తలా రూ. లక్ష చొప్పున అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీసాయిరామ్‌ విద్యాసంస్థల చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, డైరెక్టర్‌ నితిన్‌రెడ్డి, సాహితీవేత్త సత్యనారాయణ, మిమిక్రి ఆర్టిస్ట్‌ గోపి, ప్రిన్సిపల్‌ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సినీ నటి ప్రేమా తదితరులు, చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి, తదితరులు

Advertisement
Advertisement