
సాక్షి, హైదరాబాద్ : ఉచిత విద్యుత్ ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శాసనసభ సాక్షిగా అంగీకరించారు. బుధవారం సభలో రైతు సమస్యలు, ఉచిత విద్యుత్‌పై చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్ విధానాన్నే తాము కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ సభలో మాట్లాడుతూ...‘రుణమాఫీని పూర్తిగా అమలు చేశాం. ఎవరికైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తాం. మాది రైతు ప్రభుత్వం, రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం. రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఉచిత విద్యుత్‌ను అమలు చేసింది వైఎస్‌ఆరే. తడిచిన పత్తిని కొంటాం. మొన్న ఎన్నికల్లో మమ్మల్ని మేలు రకంగా, మిమ్మల్ని నాసిరకంగా గుర్తించారు. మళ్లీ అందరు ప్రజల్లోకి వెళ్లాల్సిందే.’ అని అన్నారు.
ఉచిత విద్యుత్ దివంగత నేత వైఎస్ఆర్ ఘనతే..