
పరామర్శ యాత్రకు బయల్దేరిన వైఎస్ షర్మిల
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను ఓదార్చేందుకు ఆయన తనయ వైఎస్ షర్మిల బయల్దేరారు.
హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను ఓదార్చేందుకు ఆయన తనయ వైఎస్ షర్మిల బయల్దేరారు. బుధవారం ఉదయం ఆమె లోటస్ పాండ్ నుంచి పరామర్శయాత్రకు బయల్దేరారు. ఐదున్నర ఏళ్ల క్రితం నల్లకాల్వ సాక్షిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు ప్రకటనలో భాగంగా ఆయన సోదరి షర్మిల నేటి నుంచి నల్లొండ జిల్లాలో పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల ముందుగా దేవరకొండ నియోజకవర్గంలోని మదనాపురంలో ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అటు నుంచి దేవరచర్ల తండా, గువ్వలగుట్ట ప్రాంతాల్లో పర్యటించి నాగార్జునసాగర్‌లో రాత్రి బస చేస్తారు. జిల్లాలోని 30 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు.
ఇదీ టూర్ షెడ్యూల్
21న దేవరకొండ నియోజకవర్గంలో 3 కుటుంబాలకు పరామర్శ
22న తేదీన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 3 కుటుంబాలకు పరామర్శ
23న తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలో 4 కుటుంబాలకు పరామర్శ
24న తేదీన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 5 కుటుంబాలకు పరామర్శ
25న తేదీన కోదాడ నియోజకవర్గంలో 6 కుటుంబాలకు పరామర్శ
26,27 తేదీల్లో సూర్యాపేట నియోజకవర్గంలోని 9 కుటుంబాలకు పరామర్శ