18 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర | ys sharmila 'paramarsa yatra' in nalgonda from february 18 | Sakshi
Sakshi News home page

18 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

Feb 10 2015 5:32 PM | Updated on Aug 29 2018 4:16 PM

ఫిబ్రవరి18 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల రెండో దశ పరామర్శ యాత్ర చేపట్టనున్నారని తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవ రెడ్డి తెలియజేశారు.

హైదరాబాద్: ఈ నెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాలమరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను షర్మిల ఓదారుస్తారు.

పరామర్శ షెడ్యూల్ ను తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవ రెడ్డి తెలియజేశారు. 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ఆమె పరామర్శయాత్ర కొనసాగుతుందని తెలిపారు. భువనగిరి నియోజక వర్గం నుంచి ప్రారంభమై ఆలేరు, తుంగతుర్తి, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజక వర్గాల్లో ఆమె పరామర్శ యాత్ర కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా బుధవారం ప్రారంభించాల్సిన తెలంగాణ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఈ నెల 15 వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement