యువ తరంగాలు

Youth New Tallent In Social Media And Youtube Viral Videos - Sakshi

ఓవర్‌నైట్‌తో స్టార్‌లుగా పలువురు సెలబ్రిటీస్‌   

అత్యుత్తమ కెరీర్‌కు కొత్త మలుపులు

లక్షలాది వ్యూస్‌తో వేల మంది అభిమానులు

ఈ ఏడాది సోషల్‌ మీడియాలో సరికొత్త సంచనాలు  

నెటిజన్‌లను అమితంగా ఆకట్టుకుంటున్న వెబ్‌సిరీస్‌లు  

శ్రీనగర్‌కాలనీ : చేసింది చిన్న వీడియోలే అయినా పెద్ద వైరల్‌నే సృష్టించడంతో గంటల్లోనే సెలబ్రిటీగా మారిపోతే ఆ కిక్కే వేరు. తమలోని ప్రతిభతో ఓవర్‌నైట్‌ స్టార్‌లుగా మారారు. తమ కెరీర్‌ను మలుపు తిరిగేలా చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో వీరి వీడియోలు కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్‌ సాధించడంతో పాటు వేలాది మందినిఅభిమానులుగా చేసుకున్నారు. సృజనాత్మకత, యాస, భాషతో పాటు సమాజంలో జరిగే విషయాలనుతెలుపుతూ చేస్తున్న వెబ్‌సిరీస్‌లు నెటిజన్లనుఅమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా వెలుగులోకి వచ్చిన సోషల్‌ సెలబ్రిటీస్‌ తమ కెరీర్‌ అనుభవాలను పంచుకున్నారిలా..  

పక్కా తెలంగాణ యాసతో..
నేను పక్కా హైదరాబాదీని. కొరియోగ్రాఫర్‌గా ఎదగాలన్నదే నా కోరిక. నా ఫ్రెండ్‌ తీసిన ‘నా పిల్ల’ అనే షార్ట్‌ఫిలిం సక్సెస్‌ అయ్యింది. అనంతరం తెలంగాణ భాషలో ‘దేత్తడి’ అనే ఛానెల్‌ పెట్టారు. తెలంగాణ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో పడుతున్న ఇబ్బందులను పక్కా తెలంగాణ యాసతో చేశాం. సరదాగా చేసినణీ వీడియో నెలలో మిలియన్‌ వ్యూస్‌ను సాధించింది. 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌గా వచ్చారు. ఆ తర్వాత ఎంబీబీఎస్‌ గర్ల్, హుషారు పిల్లా వీడియోలకు మంచి స్పందన వచ్చింది. దేత్తడికి ప్రస్తుతం 3లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.   – హారిక గోనెళ్ల (హారిక అలైఖ్య)– ‘దేత్తడి ఛానెల్‌’

నేటివిటీకి తగ్గట్టుగా..
నా స్వస్థలం రాజమండ్రి సమీపంలోని వేమగిరి.  చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ సినిమాలు చూసి యాక్టర్‌ అవ్వాలని డిసైడయ్యా. ఇంటర్‌ తర్వాత చెన్నైలో డిప్లొమా ఇన్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ చేశాను. ఆ తర్వాత దేవదాస్‌ కనకాల వద్ద యాక్టింగ్‌లో మెలకువలు నేర్చుకున్నాను. యూట్యూబ్‌ ఛానల్‌ తమడ ద్వారా ‘పక్కింటి కుర్రాడు’ అనే ఛానెల్‌ను ప్రారంభించారు. నేటివిటీకి తగ్గట్టుగా తీసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. ఇప్పటికీ 1.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌గా ఉన్నారు. మంచి నటుడిగా గుర్తింపు పొందాలన్నదే ఆశయం. నాగచైతన్య సినిమాలో అవకాశం వచ్చింది.    – చంద్రశేఖర్‌ సాయికిరణ్‌ (చందు)– ‘పక్కింటి కుర్రాడు’  

చాయ్‌బిస్కెట్‌తో గుర్తింపు..
మాది విజయవాడ. ఎస్వీ రంగారావు ప్రేరణతో నటుడిని అవుదామన్నదే నా కల. బీఎస్సీ అయ్యాక హైదరాబాద్‌కి వచ్చా. యూట్యూబ్‌ అండ్‌ ఫేస్‌బుక్‌ స్టార్టప్‌ ఛాయ్‌బిస్కట్‌ వారికి నా వీడియోలు నచ్చడంతో అవకాశాలు ఇచ్చారు. యువతను ఆకట్టుకొనేలా చిన్న వీడియోలు తీశాం. ఆ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలా ‘నేను మీ కళ్యాణ్‌ పేరిట’ ఛానెల్‌ పెట్టాం. లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. మా చాయ్‌బిస్కెట్‌కు 2.8 లక్షల సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా ఆశయం.           – సుహాస్‌– ‘నేను మీ కళ్యాణ్‌’

స్టార్‌ హీరోలతో వీడియోలు, ఇంటర్వ్యూలు..
నేను బీటెక్‌ చదువుతున్న రోజుల్లోనే చిన్న చిన్న స్కిట్స్‌ను రాయడం అలవాటు. ఫేస్‌బుక్‌ పేజీల్లో నాకు నచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ విభిన్నంగా వాల్‌లో రాసేవాడిని. బీటెక్‌ తర్వాత రచయిత అవుదామని హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. నా ఫేస్‌బుక్‌లో రైటింగ్స్‌ చూసిన చాయ్‌బిస్కెట్‌ టీంలో నన్ను చేర్చుకున్నారు. నా రచననలో నేటివిటీ, మసాలా ఉంటంతో మసాలా సందీప్‌గా పేరుమారింది. స్టార్‌ హీరోలతో వీడియోలు, ఇంటర్వ్యూలు చేశాం, వాటికి మంచి స్పందన వచ్చింది. రచనలు చేస్తూ నటిస్తున్నాను.      – సందీప్‌రాజ్‌– ‘మసాలా సందీప్‌’

యువతుల సమస్యలపై ఫోకస్‌..  
నేను జర్నలిజం చేస్తున్న సమయంలో సోషల్‌ మీడియాలో అప్పటికే వైరల్‌గా ఉన్న చాయ్‌బిస్కెట్‌ వారితో అనుబంధం ఏర్పడింది. గరŠల్స్‌ ఇష్యూస్‌తో సీరిస్‌ ఉంటే బాగుంటుందని అందరి అభిప్రాయాలతో గరŠల్స్‌ ఫార్ములా అనే ఛానెల్‌ను ప్రారంభించాం. సమాజంలో గరŠల్స్‌ సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ మా టీం దివ్య, హర్షితలతో వీడియోలు చేశాం. ఆ వీడియోస్‌ బాగా వైరల్‌ అయ్యాయి. మా ఛానెల్‌కి 3లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ అయ్యారు. నటిగా అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు జర్నలిజంపైనే ఆసక్తి.       – శ్రీవిద్య పాలకుర్తి– గర్ల్స్‌ ఫార్ములా
 
 ఉద్యోగాన్నే వదిలేశా..
మాది కడప జిల్లా. తమిళనాడులో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. హైదరాబాద్‌ వచ్చి మెకానికల్‌ రంగంలో ఉద్యోగిగా చేరాను. యాక్టర్‌ అవ్వాలని కోరిక చాలా బలంగా ఉండేది. ఉద్యోగాన్ని వదిలి థియేటర్‌ ఆర్టిస్టుగా చేరాను. యూట్యూబ్‌ ఛానెల్‌ ఆడిషన్స్‌లో సెలెక్టయ్యాను. అలా క్రేజీ ఖన్నా పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభమైంది. ఐటీ, యూత్, సోషల్‌ ప్రాబ్లమ్స్‌తో తీసిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది. మా ఛానెల్‌ 70వేల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. – రాజేష్‌ ఖన్నా– క్రేజీ ఖన్నా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top