‘సెల్‌’మోహన రంగ

youth busy with mobiles - Sakshi

సాక్షి, ఇబ్రహీంపట్నం‌: సెల్‌ మోహనరంగా ఎక్కడ చూసిన సెల్‌ఫోన్‌ వినియోగం విఫరీతంగా పెరిగిపోయింది. సెల్‌ఫోన్‌ ప్రభావం వల్ల మానవ విలువలు, మానవ సంబంధాలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. గత కొద్ది సంవత్సరాల క్రితం నలుగురు ఒక చోట ఉన్నారంటే సామాజీక , రాజకీయ , కుటుంబ, గ్రామాభివృద్ధి వివరాలు గురించి చర్చించుకునే వారు. ఎవరికి తొచింది వారు మాట్లాడి ఒకరికి ఒకరు పరిచయాలు పెంచుకునే ప్రయాత్నం చేసేవారు. ప్రస్తుతం అలాంటి మానవ సంబంధాలను సెల్‌పోన్లు వచ్చి చేస్తున్నాయి. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికి సెల్‌ఫోన్‌ ఉంది. దీంతో ఒకరికొకరు మాట్లాడుకొని చర్చించుకునే అవకాశం లేకుండా పోయింది. యువత ఎప్పుడూ సోషల్‌ మీడియాలో మునిగి తేలుతున్నారు.  

సెల్‌పోన్‌ చేతిలో ఉంటే చాలు ఎవరికి వారే యమునతీరే అన్నట్లుగా ఉంటుంది. సెల్‌పోన్‌ పై చేయి పెట్టి గీకడం లేదంటే చెవిలో ఇయర్‌పోన్స్‌ పెట్టుకోని అందులోని మునిగి తేలడం జరుగుతుంది. ఈ చిత్రాన్ని చూస్తే మీకే అర్థమౌతొంది. నలుగురు విద్యార్థులు ఒకే సీట్లో ఎదురురేదురుగా కుర్చున్నారు. కాని ఎవరి జోలి ఎవరికి పట్టకుండా చెవుల్లో ఇయర్‌పోన్స్‌ పెట్టుకోని పోన్లమైకంలో మునిగితేలారు. చదువుకొని విషయపరిజ్ఞానం నేర్చుకొవాల్సిన భావిభారత పౌరులే ఇలా ఉన్నారంటే పోరపాటే అందరి పరిస్థితి ఇలాగే ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top