‘వ్యక్తిత్వంతో వైఎస్సార్‌ విశిష్టత చాటారు’ | Yarlagadda Lakshmi Prasad Comments About YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

‘వ్యక్తిత్వంతో వైఎస్సార్‌ విశిష్టత చాటారు’

Sep 9 2019 3:29 AM | Updated on Sep 9 2019 3:29 AM

Yarlagadda Lakshmi Prasad Comments About YS Rajasekhara Reddy - Sakshi

అమీర్‌పేట: సంస్కారవంతమైన వ్యక్తిత్వంతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఓ విశిష్టతను చాటారనీ, మని షిలో నిజాయతీ ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదని ఆయన భావించేవారని ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. అమీర్‌పేట ఆదిత్యపార్క్‌ హోటల్‌లో ఆదివారం జరిగిన ‘వైఎస్సార్‌ ఛాయలో జి.వల్లీశ్వర్‌’ పుస్తక ఆవిష్కరణ సభకు యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్కారవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వైఎస్‌ఆర్‌ అని కొనియాడారు. సమర్థవంతమైన నాయకుడు వైఎస్‌ఆర్‌ వద్ద పీఆర్‌ఓగా పనిచేసిన వల్లీశ్వర్‌.. ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రత్యర్థులు ఏమి ఆలోచిస్తున్నారన్నది ముందుగానే పసిగట్టి వారి కంటే వేగంగా ప్రభుత్వం స్పందించేలా చూసేవారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement