బాణామతి నెపంతో ఓ మహిళపై దాడి చేయడంతో మృతి చెందింది.
దోమ: బాణామతి నెపంతో ఓ మహిళపై దాడి చేయడంతో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా దోమ మండలం మో త్కూర్‌కి చెందిన మహిళ సాయిలమ్మ బుధవారం దుస్తు లు ఉతికి ఇంటి ఆవరణలో తాడుపై వేసింది. కొద్దిసేపటి తర్వాత చూస్తే కొన్ని లోదుస్తులు కనిపించలేదు. దీంతో పొరుగింటికి చెందిన బైండ్ల రాములమ్మ బాణామతి చేసేం దుకు దుస్తులు తీసుకెళ్లి ఉంటుందని ఆమెపై దాడి చేసింది. దెబ్బలకు తాళలేక రాములమ్మ మృతి చెందింది.