కడుపు నొప్పి తట్టుకోలేక నవవధువు ఆత్మహత్య చేసుకుంది.
అదిలాబాద్ (ఇంద్రవెల్లి): కడుపు నొప్పి తట్టుకోలేక నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మడగం గ్రామపంచాయతి పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంగారె అశ్విని(18) కడుపు నొప్పి భరించలేక ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి సోమవారం ఉదయం మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.