మహిళ ఆత్మహత్య | Women Committed Suicide | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Jul 31 2018 3:18 PM | Updated on Oct 17 2018 6:10 PM

Women  Committed Suicide  - Sakshi

వనిత మృతదేహం 

ఆర్మూర్‌టౌన్‌ నిజామాబాద్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌లోని చెరువులో అలిశెట్టి వనిత(40) ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రాఘవేందర్‌ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ గ్రామానికి చెందిన వనితకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురు నందిత చాలాకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతోంది.

అది చూసి వనిత ఒక సంవత్సరం నుంచి మానసికంగా కుంగిపోతోంది. మృతురాలిని ఆస్పత్రిలో చూపించినా మానసిక స్థితి బాగుపడలేదు. దీంతో అంక్సాపూర్‌ నుంచి బయలుదేరి తన తల్లిగారింటికి వెళ్తుతున్నానని ఆదివారం భర్తతో చెప్పింది. ఇంటి నుంచి వెళ్లిన వనతి మానసికస్థితి సరిగ్గా లేనందున్న మనస్థాపం చెంది జీవితంపై విరక్తితో పెర్కిట్‌ ఊర చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement